విద్యార్థుల హాజరు నమోదు తప్పనిసరి.. రోజూ యాప్‌లో అప్‌డేట్..
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ప్రతిరోజూ తప్పనిసరిగా నమోదు చేయాలని, తాము రూపొందించిన ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది.
విద్యార్థులు రోజూ పాఠశాలకు వచ్చి అభ్యసన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా వారిలో నైపుణ్యాలు, ప్రమాణాలు పెరుగుతాయని, అదే సమయంలో ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్న అమ్మఒడి, జగనన్న విద్యాకానుక వంటి కార్యక్రమాల అసలు లక్ష్యం నెరవేరుతుందని విద్యాశాఖ అభిప్రాయపడుతోంది. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బంది హాజరు, ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న జగనన్న విద్యాకానుక, నాడు–నేడు వంటి కార్యక్రమాల అమలు తదితర అంశాలపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆయా జిల్లాల అధికారులు, సిబ్బందితో వరుసగా సమీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు శాతంపై స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల హాజరును యాప్‌లో విద్యార్థి వారీగా టిక్ చేయని విషయాన్ని ప్రస్తావించారు. ఇలా హాజరు నమోదుచేయని వారందరికీ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీచేశారు. పిల్లల హాజరును ఏరోజుకారోజు యాప్‌లో అప్‌లోడ్ చేయకపోతే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రైయివేటు పాఠశాలల విద్యార్థుల హాజరు నమోదు కూడా తప్పనిసరి అని స్పష్టం చేశారు. ప్రైయివేటు పాఠశాలల పిల్లల హాజరు నమోదు చేయని స్కూళ్లకు మెమోలు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. విద్యార్థుల హాజరు నమోదులో అలసత్వం వహించే ప్రైయివేటు స్కూళ్ల గుర్తింపు రద్దు తప్పదని హెచ్చరించారు. గత ఏడాది జగనన్న విద్యాకానుకలో భాగంగా పిల్లలకు పాఠ్యపుస్తకాల పంపిణీ వివరాలను ఇప్పటివరకు 72 శాతం వరకు మాత్రమే అప్‌లోడ్ చేశారని, మిగిలిన వివరాలను త్వరగా అప్‌లోడ్ చేయాలని చెప్పారు.
విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు తప్పనిసరి..
విద్యార్థుల సమగ్ర సమాచారానికి సంబంధించిన ‘చైల్డ్ ఇన్ఫో’లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థితో పాటు తల్లి, తండ్రి, సంరక్షకుడి ఆధార్ నంబర్లను తప్పనిసరిగా నమోదుచేసి అప్‌లోడ్ చేయాలని సూచించారు. విద్యాశాఖ జిల్లా కార్యాలయాల్లోని బోధనేతర సిబ్బంది బయోమెట్రిక్ హాజరు పూర్తిస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. కొన్ని జిల్లాల్లో మూడోవంతు మంది మాత్రమే బయోమెట్రిక్ హాజరును నమోదు చేస్తున్నారన్నారు. బయోమెట్రిక్ హాజరు పరికరాలు సరిగా పనిచేయకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుండడం వంటి సమస్యలను పలువురు సిబ్బంది అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. పనిచేయని బయోమెట్రిక్ పరికరాలను డిçప్యూటీ డీఈవో, ఎంఈవోలకు అప్పగించి కొత్తవి తీసుకోవాలని కమిషనర్ వారికి వివరించారు.
టీఎస్ టెన్త్ 2021 పరీక్షల షెడ్యూల్: పరీక్షల సమయం అరగంట పెంపు.. చాయిస్ 50 శాతం..ఇంకా..

Published date : 19 Mar 2021 03:58PM