విద్యార్థుల చూపు..అమెరికా వైపు..!
Sakshi Education
న్యూఢిల్లీ: ఉన్నత విద్య అనగానే గుర్తొచ్చే దేశం అమెరికా. 2019-20 విద్యా సంవత్సరంలో దాదాపు 2 లక్షల మంది భారత విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికాను ఎంచుకున్నారు.
ఈ విషయాన్ని భారత్‌లోని ఆ దేశ రాయబార కార్యాలయం వెల్లడించింది. అమెరికాలో 10 లక్షల మంది విదేశీ విద్యార్థులుండగా, వారిలో 20 శాతం మంది భారతీయులే. ఎక్కువ మంది అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల గమ్యం అమెరికాయేనని ఆ నివేదికలో తెలిపింది. అక్కడ నాణ్యమైన విద్య, ప్రాక్టికల్ శిక్షణ లభించడమే ఇందుకు కారణమని పబ్లిక్ అఫైర్స్ మినిస్టర్ కౌన్సిల్ డేవిడ్ కెన్నడీ చెప్పారు. భారతీయ విద్యార్థులకు సాయం అందించేందుకు అమెరికా ప్రభుత్వం ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, ముంబైలో అడ్వైజింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది.
Published date : 17 Nov 2020 02:31PM