Skip to main content

విద్యార్థుల భవితవ్యానికి ఈ పది చిట్కాలు పాటిస్తే చాలు...

బడికి వెళ్లడం, పాఠాలు వినడం, ఆడుకోవడం నిత్యకృత్యమే.
అయితే విద్యా సంవత్సరం ఎలా గడిచిపోయినా చివరిలో మాత్రం పరీక్షలు రాయాల్సిందే. మిగతావారి సంగతి ఎలా ఉన్నా పదో తరగతి విద్యార్థుల భవితవ్యానికి ఈ పరీక్షలే పునాది. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎలా సిద్ధమవ్వాలనే దానికి సంబంధించి కొన్ని చిట్కాలు మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం.

అవి ఏమిటంటే...
  1. ప్రతిరోజూ తప్పనిసరిగా బడికి వెళ్లాలి. ఉపాధ్యాయుడు బోధించే అంశాలను శ్రద్ధగా ఆలకించాలి. ప్రతిరోజూ సాయంత్రం ఇంటికొచ్చాక అవి చదువుకోవాలి. వీలైతే చూడ కుండా రాయడానికి యత్నించాలి.
  2. ప్రతి పాఠాన్ని ఇష్టంతో నేర్చుకోవాలి. అంతకంటే ముఖ్యంగా రోజురోజుకూ చదువుపై శ్రద్ధ పెంచుకోవాలి.
  3. చక్కగా తప్పులు దొర్లకుండా అందంగా, వేగంగా రాయడాన్ని సాధన చేయాలి.
  4. ఉపాధ్యాయుడు పాఠం చెప్పే సమయంలో ఏదైనా సందేహం వస్తే తప్పనిసరిగా అడిగి తెలుసుకోవాలి. మొహమాటపడకూడదు. అలా ఉంటే నష్టపోతారు.
  5. ప్రతిరోజూ ఐదు గంటలకే నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. గంటసేపు చదువుకోవాలి. కాసేపు వ్యాయామం చేయాలి. ఇక రాత్రి పది గంటలకల్లా ఎట్టిపరిస్థితుల్లో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి.
  6. ప్రతిరోజూ విధిగా రెండు పూటలా స్నానం చేయాలి. వారానికి రెండు లేదా మూడు పర్యాయాలు తలస్నానం చేయాలి.
  7. ప్రతిరోజూ పోషక విలువలు ఉండే ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి.
  8. చదువులోగాని ఇతర ఏ విషయాల్లోగాని ఇతర విద్యార్థులతో బహిరంగ పోటీకి దిగవద్దు. మంచి మార్కులతో ఉత్తీర్ణులవ్వాలనే లక్ష్యంతో ముందుకుసాగాలి.
  9. మనసును ప్రశాంతంగా, నిర్మలంగా ఉంచుకోవాలి.
  10. విద్యార్థులకు ఆత్మవిశ్వాసం అత్యంత ముఖ్యం. ధ్యానం చేసే అలవాటు ఉంటే చాలా మంచిది. ఇక ప్రత్యక్ష దేవతలైన అమ్మానాన్నల పాదాలకు నమస్కరించడం ఓ అలవాటుగా మార్చుకోండి. తర్వాత దేవుడికి దండం పెట్టండి . నిద్రకు ముందు ప్రార్థన చేయడం నిత్యకృత్యం కావాలి.
Published date : 05 Feb 2020 03:46PM

Photo Stories