Skip to main content

వచ్చే ఏడాదిలో అదనపు క్లాసులు నిర్వహింస్తాం : ఆదిమూలపు సురేష్

సాక్షి, అమరావతి: కరోనా వైరస్ ప్రభావంతో విధించిన లాక్‌డౌన్ కారణంగా విద్యార్థులు ఇప్పుడు నష్ట పోయిన రోజులను వచ్చే విద్యా సంవత్సరంలో సెలవులు కుదించి, అదనపు క్లాసుల నిర్వహణ ద్వారా సర్దుబాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
సచివాలయంలో ఏప్రిల్ 22న ఆయన విలేకరులతో మాట్లాడారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాష్ట్రంలో 90 లక్షల మంది విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. 10వ తరగతి పరీక్షలు లాక్ డౌన్ తరువాత నిర్వహిస్తామని.. వారి కోసం దూరదర్శన్ ద్వారా ఆన్‌లైన్ క్లాసులు బోధిస్తున్నామని, వీటికి 5 లక్షల మంది హాజరవుతున్నారని చెప్పారు. ఏప్రిల్ 22 నుంచి ఎఫ్‌ఎం, రేడియో ద్వారా కూడా క్లాసులు చెప్పే ప్రక్రియ మొదలైందన్నారు.
Published date : 23 Apr 2020 04:01PM

Photo Stories