‘ఉపాధ్యాయుల’ బదిలీలపై త్వరలో నిర్ణయం
Sakshi Education
సాక్షి, అమరావతి: మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీల అంశంపై ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయాలు, సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు మున్సిపల్ శాఖ అదనపు డెరైక్టర్ రవీంద్రబాబు చెప్పారు.
రాష్ట్రంలో మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ అంశంపై చర్చించేందుకు 14 ఉపాధ్యాయల సంఘాలతో ఆయన బుధవారం గుంటూరులో సమావేశమయ్యారు. జిల్లా పరిషత్ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ విధివిధానాలను మున్సిపల్ ఉపాధ్యాయులకు వర్తింపజేయ వద్దని సంఘాలు ఆయనకు విజ్ఞప్తి చేశాయి. మున్సిపల్ ఉపాధ్యాయుల సర్వీస్ నిబంధనలను 2017లో క్రమబద్ధీకరించడంతో అప్పటి నుంచి సర్వీసును పరిగణనలోకి తీసుకోవాలని కోరాయి. రవీంద్రబాబు మాట్లాడుతూ..ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలతో కూడిన నివేదికను పురపాలక శాఖ మంత్రి బొత్స, పురపాలక శాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌కు నివేదిస్తానని చెప్పారు. దీనిపై అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఓ విధాన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
Published date : 12 Nov 2020 04:55PM