ఉద్యోగులకు ఫేస్‌బుక్ మరో గుడ్‌న్యూస్
Sakshi Education
వాషింగ్టన్: ప‌్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ తన ఉద్యోగులకు మరోసారి శుభవార్త అందించింది.
కరోనా నేపథ్యంలో పలు సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు అనేక సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాయి. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్ తమ ఉద్యోగులు ఇప్పట్లో ఆఫీస్‌కు రానవసరం లేదని, వచ్చే ఏడాది జూన్ వరకు ఇంటివద్ద నుంచే పనిచేసుకోవచ్చని ప్రకటించింది. అంతేకాకుండా హోమ్ ఆఫీస్ అవసరాల కోసం వెయ్యి డాలర్లు ఇస్తామని కూడా వెల్లడించింది. కరోనా రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో డాక్టర్లు, ప్రభుత్వాల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫేస్‌బుక్ వర్గాలు వెల్లడించారు. దాదాపు మరో ఏడాది పాటు అంటే 2021, జూలై వరకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇస్తున్నట్లు ఫేస్‌బుక్ పేర్కొంది. దీనితో పాటు నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో ఉద్యోగులతో పలు చోట్ల ఆఫీసులను నడిపిస్తున్నామని తెలిపింది. గూగుల్, ట్విటర్ కూడా తన ఉద్యోగులకు వచ్చే ఏడాది జూన్ వరకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరగుతుండటంతో అమెరికా, లాటిన్ అమెరికాలోని కార్యాలయాలను ఇప్పట్లో తెరిచే అవకాశం లేదని ఫేస్‌బుక్ వర్గాలు తెలిపారు.
Published date : 07 Aug 2020 08:52PM