తొమ్మిది నెలలుగా తెరుచుకోని భవిత కేంద్రాలు.. ఆ పిల్లల పరిస్థితి..!
Sakshi Education
సిద్దిపేట పట్టణానికి చెందిన అవాల గీత, రాములుకు ఇద్దరు సంతానం. కూతురు లిఖిత (16) పుట్టుకతో మానసిక దివ్యాంగురాలు. పేద కుటుంబం కావడంతో స్థానిక భవిత సెంటర్‌లో చేర్పించారు.
అక్కడ ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు చదువుతో పాటు ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన వైద్య సౌకర్యాలు కల్పించడంతో ఆమెలో కొంత మార్పు వచ్చింది. కరోనా నేపథ్యంలో 8 నెలలుగా భవిత సెంటర్లు తెరుచుకోకపోవడంతో ఆమెను ఇంటి వద్ద సంరక్షించడం తల్లిదండ్రులకు భారంగా మారింది. సమయానికి మందులు వేయడం, ఆహారం అందించడం, ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణ కష్టంగా మారింది.
కరోనా మహమ్మారి.. ప్రత్యేక అవసరాలు (శారీరక, మానసిక, వినికిడి, దృష్టి లోపాలు)ఉన్న విద్యార్థులకు శాపంగా మారింది. పాఠశాలల్లో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఈ విద్యాసంవత్సరంలో పాఠశాలలు తెరుచుకోలేదు. రాష్ట్ర విద్యా శాఖ అమలు చేస్తున్న ఆన్‌లైన్ బోధన, ఇతర మాద్యమాల ద్వారా బోధన జరుగుతోంది. భవిత సెంటర్లలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వైద్య సేవలు, బోధన అందట్లేదు. దీంతో దివ్యాంగులైన తమ పిల్లలకు చదువు, వైద్య సేవలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
8 నెలలుగా ఇంటి వద్దనే..
ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ఏర్పాటు చేసిన భవిత సెంటర్లు తెరవకపోవడంతో 8 నెలలుగా పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ‘అందరు చదవాలి.. అందరు ఎదగాలి’అనే నినాదంతో సర్వశిక్ష అభియాన్ ద్వారా చదువుతో పాటు, పిల్లల మానసిక, శారీరక, సామాజిక సంపూర్ణ వికాసానికి దోహదపడేలా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రత్యేక అవసరాల పిల్లలకోసం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 467 భవిత సెంటర్లను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల వయసున్న వారిలో 52 వేల మంది వివిధ రకాల దివ్యాంగులు ఉన్నారు. ఇందులో 7,837 మంది పిల్లలు మానసిక, శారీరక, వినికిడి లోపం, దృష్టి లోపం ఎక్కువగా ఉన్నవారు ఉన్నారు. ఇందులో మానసిక దివ్యాంగులకు ప్రత్యేక బోధన చేపట్టడంతో పాటు, వారికి కావాల్సిన ఫిజియోథెరపీ, ఇతర వైద్య సేవలు అందించేవారు. ఇందుకు 892 మంది దివ్యాంగులైన విద్యార్థులకు బోధించేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఉపాధ్యాయులను నియమించారు. వారి శారీరక, మానసిక స్థితిని అంచనా వేసి ఆట పాటలు, చార్టులు, ఇతర బోధన ఉపకరణాలతో బోధించేవారు. కరోనాతో సెంట ర్లు తెరవకపోవడంతో చదువుతో పాటు ఫిజియోథెరపీ సేవలు కూడా నిలిచిపోయా యి. కరోనా నేపథ్యంలో పిల్లలు ఇంటి వద్దనే ఉండటంతో వారి వెంట తప్పనిసరిగా ఒకరు ఉండాల్సి వస్తోందని, దీంతో ఇతర పనులు చేసుకోలేకపోతున్నామని తల్లిదండ్రులు వాపోతున్నారు. కేంద్రంలో తక్కువ సంఖ్యలో పిల్లలు ఉంటారని, వైద్యుల సూచనలు, సలహాల మేరకు భవిత సెంటర్లు తెరవాలని కోరుతున్నారు.
ఫోన్ ద్వారా సలహాలు..
కరోనా నేపథ్యంలో భవిత సెంటర్లను తెరవట్లేదు. జిల్లాలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు ఫోన్ ద్వారా సలహాలు, సూచనలు ఇస్తున్నాం. సెంటర్లు తెరవాలి అని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే సెంటర్లు తెరిచి సేవలు అందిస్తాం.

Published date : 01 Dec 2020 04:45PM