Skip to main content

తెలుగు వికీపీడియాలో వ్యాసాలు పెంచాలి: తెలుగు వికీపీడియా సదస్సు-2020లో వక్తల నిర్ణయం

రాయదుర్గం: విజ్ఞానమంతా ఆంగ్లంలోనే నిక్షిప్తమై ఉందని, దాన్ని అనువదించి భవిష్యత్తరాలకు అందించాలంటే మాతృభాష తెలుగుకు ప్రాధాన్యమివ్వా లని వికీపీడియా సదస్సు-2020లో వక్తలు అభిప్రాయపడ్డారు.
వికీ పీడియాలో ప్రస్తుతం దాదాపు 72 వేల వరకూ ఉన్న వ్యాసాలను ఏడు లక్షలకు పెంచాలని సదస్సులో తీర్మానించారు. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్‌లోని కోహ్లీ సెంటర్ ఆన్ ఇంటెలీజెంట్ సిస్టమ్స్ (కేసీఐఎస్) ఆడిటో రియంలో శనివారం ‘ప్రాజెక్ట్ తెలుగు వికీ’సద స్సును నిర్వహించారు. ఈ సదస్సులో తెలంగాణ రాష్ట్ర భాషాసంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొని మాట్లా డుతూ.. వికీపీడియాలో వ్యాసాలు పెంచడం కోసం ప్రత్యేక యంగ్ బ్రిగేడ్‌ను తయారు చేసేందుకు ట్రిపుల్‌ఐటీతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. సాంస్కృతిక శాఖ ద్వారా అనేక చారిత్రక, భాషా, పండుగల కార్యక్రమాలు నిర్వహించి తెలంగాణ ఔన్యత్యాన్ని చాటుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణలోని జానపద, గిరిజన కళారూపాలు, దక్కనీ సంస్కృతి, ఇతర అంశాలు తెలిపేందుకు యూ ట్యూబ్ చానల్ నిర్వహిస్తున్నామని చెప్పా రు. వికీపీడియాలోనే కాకుండా ఎక్కడైనా మాటా ్లడే భాష, రాసే భాష వేర్వేరుగా ఉండాలని అనుకుంటారనీ, కానీ మాట్లాడే భాషలోనే రాయడం మంచిదని ప్రొఫెసర్ నాగేశ్వర్ అభి ప్రాయపడ్డారు. సాంకేతిక విజ్ఞానం పెరగడంతో మనిషి మేధస్సు పెరిగినా మనస్సు మాత్రం పెరగడం లేదని లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాశ్ నారాయణ్ పేర్కొన్నారు. అందరూ సొంత భాష తెలుగు, అరువుభాష ఆంగ్లాన్ని నేర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ వికీపీడియాలో భాగస్వాములు కావాలని కోరారు. దేశంలో ప్రస్తుతం డిజిటల్ లిటరసీ సమస్య ఉందని, వికీపీడీయాలో 7 మిలియన్ల ఇంగ్లీష్ వ్యాసా లుంటే అవి అమెరికా, యూరోప్ వాళ్ళే రాసి నవేనని ట్రిపుల్‌ఐటీ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ రాజిరెడ్డి పేర్కొన్నారు. తెలుగు వికీ పీడియా వ్యాసాలు కనీసం 7 లక్షలకు పెంచాలనే లక్ష్యంతో ట్రిపుల్‌ఐటీ ప్రత్యేక సెల్ పనిచేస్తోందని తెలిపారు.

వికీపీడియాపై ఉచిత శిక్షణ
ట్రిపుల్‌ఐటీ ప్రాంగణంలో ఉచితంగా ప్రతీ శుక్రవారం వికీథాన్ కార్యక్రమాన్ని మ ధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు, ప్రతీ శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వికీపీడియాపై శిక్షణ నిర్వహిస్తున్నామని ట్రిపుల్‌ఐటీ ఆర్ అండ్ డీ మాజీ డీన్ ప్రొఫెసర్ వాసుదేవవర్మ చెప్పారు. తెలుగు వికీపీడియాలో వ్యాసాల సంఖ్య గణనీయంగా పెంచేందుకు హైదరాబాద్‌లోని ట్రిపుల్‌ఐటీలో ప్రాజెక్టు తెలుగు వికీ పేరిట ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ట్రిపుల్‌ఐటీ డెరైక్టర్ ప్రొఫెసర్ పీజేనారాయణన్ తెలిపారు.
Published date : 10 Feb 2020 03:45PM

Photo Stories