Skip to main content

శ్రీసిటీ ఐఐఐటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

వరదయ్యపాళెం (చిత్తూరు జిల్లా): ఐబీఎం ఫెలో, సీటీవో (ఏఐ అఫ్లికేషన్స్) షాలిని కపూర్, శ్రీసిటీ ఐఐఐటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - మెషిన్ లెర్నింగ్‌లో కొత్తగా ఎంటెక్ కోర్సును శనివారం ప్రారంభించారు.
పరిశ్రమల్లో పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేసే ప్రయత్నానికి మార్గదర్శకత్వం వహించినందుకు శ్రీసిటీ ఐఐఐటీని ఆమె అభినందించారు. ఆమె ప్రారంభోపన్యాసంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ - మెషిన్ లెర్నింగ్‌లోని కొత్త పోకడలను, ఆ రంగంలో గణనీయంగా పెరుగుతున్న అపారమైన ఉద్యోగ అవకాశాలను ఆమె విశదీకరించారు. భవిష్యత్ ఫలితాలను అంచనా వేయడానికి, రూపొందించడానికి, నిర్ణయాలు-ప్రక్రియలను యాంత్రీకరణ చేయడానికి, కొత్త వ్యాపార నమూనాలను నిర్వహించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-మెషిన్ లెర్నింగ్ పరిజ్ఞానం సాయపడుతుందన్నారు. ఇది పాత ప్రక్రియలను పునరుజ్జీవింపచేయడానికి లేదా కొత్త ప్రక్రియలను కనుక్కోవడంలో, కొత్త చానెళ్లను తెరవడానికి, సంస్థల్లో లభించే భారీ డేటా సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి దోహదపడుతుందన్నారు. అల్గారిథం అభివృద్ధి, కోడింగ్, డేటా సైన్స్ మొదలైన వాటిలో కెరీర్లు అందుబాటులో ఉన్నాయని ఆమె వివరించారు.
Published date : 28 Sep 2020 02:56PM

Photo Stories