Skip to main content

సీమెన్స్ సెంటర్లలో నైపుణ్య శిక్షణకు అంగీకారం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీమెన్స్ కంపెనీ సెంటర్లలో ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ (ఈఎస్‌డీఎం) పథకం కింద రాష్ట్రంలోని యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది.
తాజా ఉద్యోగ నోటిఫికేషన్స్ కోసం క్లిక్ చేయండి.

కెరీర్ గెడైన్స్, అన్ని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ మెటీరియల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్... వంటి ఎన్నో కెరీర్ సంబంధిత అంశాల కోసం క్లిక్ చేయండి. 

ఈ మేరకు ఏపీఎస్‌ఎస్డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ సమక్షంలో ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్లు వి.హనుమ నాయక్, డాక్టర్ బి.నాగేశ్వరరావు, రీజినల్ మేనేజర్ ఎలక్ట్రానిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రీజినల్ హెడ్ లాలూ నాయక్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, 34 టెక్నికల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్లలో 58 కోర్సుల్లో యువతకు ఉపాధి ఆధారిత కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
Published date : 22 Jan 2021 03:03PM

Photo Stories