సీబీఎస్‌ఈ అఫిలియేషన్ వ్యవస్థలో మార్పులు
Sakshi Education
న్యూఢిల్లీ: పాఠశాలల అఫిలియేషన్ వ్యవస్థకు సంబంధించి సమూల మార్పులు తీసుకొచ్చేలా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ప్రయత్నాలు చేస్తోంది.
తక్కువ మానవ ప్రమేయంతో, డిజిటల్ సేవలను వినియోగించుకొని, డేటా ఎనలిటిక్స్ ద్వారా అవరసమైన సేవలను పొందేలా అఫిలియేషన్ వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టనున్నట్లు సీబీఎస్‌ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి తెలిపారు. ఈ కొత్త వ్యవస్థ మార్చి 1 నుంచి అందుబాటులోకి రానుందని స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)కి అనుగుణంగా దీన్ని తయారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీబీఎస్‌ఈ అఫిలియేషన్ వ్యవస్థలో పాదర్శకతను, అకౌంటబిలిటీని, వ్యవస్థాగత ప్రక్రియను సాధించేందుకు ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు తెలిపారు.త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తిస్థాయి మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు చెప్పారు.
Published date : 25 Jan 2021 07:52PM