Skip to main content

రౌండ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో మరోసారి మెరిసిన హెచ్‌సీయూ..

రాయదుర్గం: రౌండ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ (ఆర్‌యూఆర్‌) అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్స్‌–2021లో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) మరోసారి సత్తాచాటింది.
2020లో గ్లోబల్‌ స్థాయిలో 363వ స్థానంలో ఉన్న హెచ్‌సీయూ.. 2021లో 350వ స్థానంలో నిలిచింది. రష్యాలోని మాస్కో ద్వారా అంత ర్జాతీయ స్థాయిలో ర్యాంకింగ్స్‌ను ఆర్‌యూఆర్‌ ర్యాంకింగ్‌ ఏజెన్సీ ఏటా ప్రకటిస్తోంది. అందులో భాగంగా బుధవారం 2021 ర్యాం కింగ్స్‌ను ప్రకటించినట్లు హెచ్‌సీయూ పీఆర్‌వో ఆశిష్‌ జాకబ్‌ థామస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 2010–2021 వరకు 20 ఇండికేటర్స్‌ను టీచింగ్, రీసెర్చ్, ఇంటర్నేషనల్‌ డైవర్సిటీ, ఫైనాన్షియల్‌ ససై్టనబిలిటీ అనే భాగాలుగా విభజించి ప్రతిభ, కృషి ఆధారంగా ర్యాంకింగ్స్‌ను ప్రకటించారు. ఆర్‌యూఆర్‌ ర్యాంకింగ్స్‌లో ఉన్న 13 భారతీయ ఉన్నత విద్యాసంస్థల్లో మొదటి 6 స్థానాల్లో ఐఐఎస్‌సీ, ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌–పుణే తర్వాత ర్యాంక్‌ పొందిన ఏకైక యూనివర్సిటీగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఉండటం విశేషం. కాగా, టీచింగ్‌ ర్యాంకింగ్స్‌లోనూ ప్రపంచ వ్యాప్తంగా 84వ స్థానం పొందడం మరో విశేషం.

ఆర్‌యూఆర్‌లో హెచ్‌సీయూ విశిష్టత..
  •  హెచ్‌సీయూ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో 61.092 స్కోరుతో 350వ ర్యాంకు
  •  టీచింగ్‌ ర్యాంకింగ్స్‌లో 82.295 స్కోరుతో 84వ ర్యాంకు
  •  రీసెర్చ్‌ ర్యాంకింగ్స్‌లో 48.121 స్కోరుతో 492వ ర్యాంకు
  •  ఇంటర్నేషనల్‌ డైవర్సిటీ ర్యాంకింగ్స్‌లో 18.809 స్కోరుతో 796వ ర్యాంకు
  •  ఫైనాన్షియల్‌ సస్టేనబిలిటీ ర్యాంకింగ్స్‌లో 54.927 స్కోరుతో 516వ ర్యాంకు
Published date : 29 Apr 2021 03:40PM

Photo Stories