Skip to main content

పరీక్షలొస్తున్నాయ్...పారాహుషార్

జనవరి నెల ఇప్పటికే సగం గడిచిపోయింది. ఫిబ్రవరి, మార్చి నెలలు మాత్రమే మిగిలాయి.
పరీక్షల సమయం ఆసన్నమవుతోంది. అందు వల్ల విద్యార్థులు ఇప్పటిదాకా ఎలా చదువుకున్నా ఇప్పటినుంచీ పుస్తక పఠనానికి వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. వార్షిక పరీక్షలకు సర్వసన్నద్ధం కావాలి. ఈ పరీక్షలకు ముందు బడిలో నిర్వహించే పరీక్షల్లో వచ్చే మార్కులను బట్టే ఇక ఎలా చదువుకోవాలనేది అర్థమవుతుంది. విద్యా ర్థులు వేకువజామునే నిద్రలేచి చదువుకోవడం ప్రారంభించాల్సిన తరుణమిదే. వేకువజామున చదువు కుంటే అది మెదడులో నిక్షిప్తమైపోతుంది. ఎందుకంటే ఆ సమయం లో ఎలాంటి శబ్దాలు ఉండదు. ప్రశాంతవాతావరణం నెలకొని ఉంటుంది. ఏకాగ్రతకు ఎక్కువ అవకాశం ఉంటుంది. మనసు ఏకాగ్రమైనప్పుడే ఎక్కువసేపు చదువుకోవడంతోపాటు అన్ని అంశాలను గుర్తుంచుకునేందుకు వీలవుతుంది. దీనికితోడు ఒకసారి చదువుకున్న తర్వాత పుస్తకం మూసేసి మీ జ్ఞాపకశక్తికి పరీక్ష పెట్టండి. ఎంతసేపు చదువుకున్నామనే దానికంటే ఎంతబాగా గుర్తుపెట్టుకున్నామనేదే ముఖ్యం. గుర్తుంటే పరీక్ష సమయంలో పరీక్షలకు జవాబులు రాయగలుగుతాం. దీనినిబట్టే మార్కులు, ర్యాంకు లు వస్తాయి. విద్యార్థుల భవితవ్యం ఈ రెండింటి మీదే ఆధారపడి ఉం టుంది. ఇక పిల్లలు బడికి వెళ్లే సమయంలోనేకాకుండా తిరిగి వచ్చే సమయంలో బస్సులో ఉంటే కనుక ఆ రోజు చెప్పిన పాఠాలను కూడా ఒకసారి నెమరువేసుకోండి. దీనినొక అలవాటుగా మార్చుకోండి. ఆదివారంతోపాటు పండుగలు లాంటివాటి కారణంగా సెలవులు వస్తే పుస్తకాలను పక్కనపెట్టకుండా వాటిమీదే దృష్టి పెట్టడం అలవాటు చేసుకోండి. వాస్తవానికి విద్యార్థులు ఈ సమయంలో చదువుకోవడం కాకుండా పునశ్చరణ దశలో ఉండాలి.
Published date : 20 Jan 2020 03:10PM

Photo Stories