Skip to main content

ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ పరీక్షలకు 9,942 మంది హాజరు

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ పరీక్షల్లో భాగంగా గురువారం ఉదయం కేటగిరీ-111 వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ ఉద్యోగాలకు 60 పరీక్ష కేంద్రాల్లో 9,942 మంది (69.68 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు 14,268 కాగా, 4,326 (30.32) మంది హాజరు కాలేదు. ఐసోలేషన్ గదిలో ఆరుగురు కోవిడ్ అనుమానిత అభ్యర్థులు పరీక్షలు రాశారు.

ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ పరీక్షలకు సంబంధించిన (సమాధానాలు) కీ పేపర్ కొరకు క్లిక్ చేయండి.

మధ్యాహ్నం జరిగిన కేటగిరీ-111 ఏఎన్‌ఎం, వార్డు హెల్త్ సెక్రటరీ ఉద్యోగ పరీక్షలకు 145 కేంద్రాల్లో 24,492 మంది (71.02 శాతం) అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 34,485 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయగా, 9,993 (28.98 శాతం) అభ్యర్థులు పరీక్షకు హాజరు కాలేదు. ఐసోలేషన్ గదిలో 33 మంది కోవిడ్ అనుమానిత అభ్యర్థులు పరీక్ష రాశారు. ఓఎంఆర్ సమాధాన పత్రాల స్కానింగ్ ప్రక్రియ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌ల పర్యవేక్షణలో జరిగింది.
Published date : 25 Sep 2020 03:08PM

Photo Stories