పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టులకు వయోపరిమితి 44 ఏళ్ళకు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు పరిధిలో 151 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకానికి సంబంధించి గరిష్ట వయోపరిమితిని 44 ఏళ్ళకు పెంచారు.
ఈ మేరకు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూలై 7న ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 4వ తేదీలోగా తమ దరఖాస్తులను పంపుకోవచ్చని బోర్డు చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు.
Published date : 24 Aug 2021 03:30PM