Skip to main content

పాఠశాలలు, కళాశాలలు పూర్తిగా సురక్షితం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో స్కూళ్లు, కాలేజీల్లో కరోనా నియంత్రణలో ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
భౌతిక దూరం, శానిటైజేషన్, మాస్క్‌లు తప్పనిసరి చేయడంతో పాటు తరగతులను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో నిర్వహిస్తుండటంతో విద్యార్థులు, టీచర్లు, లెక్చరర్లు కరోనా బారి నుంచి తప్పించుకున్నారు. రాష్ట్రంలో స్కూళ్లు తెరిచినప్పటి నుంచి ఈ నెల 16 వరకు 7,04,837 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 1,375 మంది (0.19 శాతం) విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. అలాగే 95,251 మంది టీచర్లు, లెక్చరర్లకు టెస్ట్‌లు చేయగా.. 444 మంది (0.46 శాతం)కి కరోనా సోకినట్లు వెల్లడైంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1,13,150 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, 235 మందికి పాజిటివ్ వచ్చింది. టీచర్ల విషయంలోనూ గుంటూరు జిల్లాలోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో 10,785 టెస్టులు చేయగా, 102 మంది టీచర్లకు కరోనా సోకింది.
Published date : 21 Jan 2021 03:55PM

Photo Stories