పాలిటెక్నిక్ పరీక్ష పత్రం లీకుపై పోలీసులకు ఫిర్యాదు: టెక్నికల్ బోర్డు
Sakshi Education
బాపట్ల: బాపట్లలో పాలిటెక్నిక్ పరీక్ష పత్రం లీకు ఘటనపై స్టేట్ టెక్నికల్ బోర్డు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రశ్నపత్రం లీకు వ్యవహారంలో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్, అసిస్టెంట్ చీఫ్ హనుమంతరావు, అధ్యాపకురాలు రమాదేవిని ఈపాటికే సస్పెండ్ చేసిన బోర్డు అధికారులు వారితోపాటు వారికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం బాపట్ల రూరల్ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పరీక్ష పత్రం లీకు వ్యవహారంపై నివేదిక ఇవ్వాల్సిందిగా స్టేట్ టెక్నికల్ బోర్డు కార్యదర్శి విజయభాస్కర్ నియమించిన ఆర్‌జేడీ పద్మారావు, బోర్డు జాయింట్ డైరెక్టర్ నారాయణరావు, విజయవాడ పాలిటెక్నిక్ కళాశాల హెచ్‌వోడీ నాగరాజు కమిటీ సేకరించిన వివరాలను పోలీసుల ముందు ఉంచారు. ప్రశ్నపత్రం లీకు వ్యవహారంలో ఎంత మొత్తంలో చేతులు మారిందీ, ఎవరికి ప్రమేయం ఉంది అనే కోణంలో బోర్డు విచారణ చేసింది
Published date : 12 Apr 2021 04:49PM