Skip to main content

నవంబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు ప్రారంభించాలి: సీఎం వైఎస్ జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం స్పందన కార్యక్రమంలో భాగంగా పలు కీలక విషయాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలకు మార్గనిర్దేశం చేశారు.
నవంబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు ప్రారంభించాలి: సీఎం వైఎస్ జగన్ నవంబర్ 2న స్కూళ్లను ప్రారంభించాలని నిర్ణయించిన నేపథ్యంలో అక్టోబర్ 5న విద్యార్థులకు విద్యా కానుక పంపిణీ చేయనున్నట్లు సీఎం వెల్లడించారు.

అక్టోబర్ 5వ తేదీన పిల్లలకు విద్యా కానుక కిట్‌లు అందజేస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. నవంబర్ 2వ తేదీన స్కూళ్లు తెరవాలని నిర్ణయించామని, అందువల్ల ఇప్పుడే పిల్లలకు కిట్ ఇస్తే స్కూళ్లు తెరిచేలోగా యూనిఫామ్ కుట్టించుకోగలుగుతారన్నారు. గతంలో అక్టోబరు 5న స్కూళ్లు తెరవాలని నిర్ణయించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నవంబరు 2వ తేదీకి వాయిదా వేశామని చెప్పారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి మార్గనిర్దేశం చేశారు.
  • నాడు-నేడు (స్కూళ్లు) మొదటి దశలో ఇంకా పనులు మొదలు కాని స్కూళ్లలో వెంటనే పనులు మొదలు పెట్టాలి. 701 టాయిలెట్లకు వెంటనే శ్లాబ్ పనులు పూర్తి చేయాలి. జేసీలు రోజూ పర్యవేక్షించాలి.
  • అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణాలకు స్థలాల గుర్తింపులో తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలు వెనుకబడి ఉన్నాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు వెంటనే చొరవ చూపాలి.
  • రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తుండగా, వాటిలో అమలాపురం, మదనపల్లె, పిడుగురాళ్ల, ఆదోని, ఏలూరు, పులివెందులలో భూసేకరణ జరగాల్సి ఉంది. కాకినాడ, ఒంగోలు, అనంతపురంలోని పాత కాలేజీలకు ఇంకా అదనపు భూమి కావాలి. వెంటనే ఆ మేరకు భూమి సేకరించాలి.
Published date : 30 Sep 2020 12:44PM

Photo Stories