నేటితో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ప్రక్రియ ముగింపు
Sakshi Education
నూజివీడు: నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో ప్రవేశానికి నిర్వహిస్తున్న ప్రక్రియ సోమవారంతో ముగియనుంది.
ఈ నెల 4వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా ఆదివారం నాటికి ఓపెన్ కేటగిరి, బీసీ-ఏ, బీ,సీ,డీ,ఈ, ఈబీసీ కేటగిరీల సీట్లు భర్తీ అయినట్లు కన్వీనర్ గోపాలరాజు తెలిపారు. ఈ నెల 11న ఎస్సీ, ఎస్టీ కేటగిరీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. నాలుగు ట్రిపుల్‌ఐటీలలో 4,400 సీట్లకు, స్పెషల్ కేటగిరీ సీట్లు 273 మినహాయించగా, మిగిలిన 4,127సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామన్నారు.
Published date : 11 Jan 2021 01:51PM