నేటి నుంచి డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్లు
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా 2020-21కి అండర్ గ్రాడ్యుయేట్ (డిగ్రీ) కోర్సుల్లో ప్రవేశాలను ఆన్‌లైన్ ద్వారా నిర్వహించే ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి షెడ్యూల్ విడుదల చేశారు. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్ నిర్వహించే ‘ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్’ (ఓఏఎండీసీ) ద్వారా అడ్మిషన్లను చేపడుతున్నారు. ‘oamdc.ap.gov.in’ వెబ్‌సైట్‌లో 6వ తేదీ నుంచి 17 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంటుంది.
Published date : 06 Jan 2021 03:09PM