నాడు - నేడు తొలిదశలో ఇప్పటికే రూ.2,280.10 కోట్ల వ్యయం
సూక్ష్మ స్థాయి ఆలోచనతో సర్కారు బడికి మహర్దశ
పాదయాత్రలో భాగంగా ప్రభుత్వ స్కూళ్ల స్థితిగతులు, విద్యార్థులు పడుతున్న కష్టాలు చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూక్ష్మ స్థాయిలో ఆలోచన చేసి మన బడి నాడు-నేడు కింద చేయాల్సిన పనులను నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఏకంగా రూ.826.70 కోట్ల అంచనా వ్యయంతో నిరంతర నీటి సరఫరా సదుపాయంతో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. తొలి దశలో 14,293 మరుగుదొడ్ల పనులకు మంజూరు ఇచ్చారు. అలాగే రక్షిత మంచినీటి సరఫరాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. రూ.325.19 కోట్ల వ్యయంతో 14,474 రక్షిత మంచినీటి పనులను చేపట్టారు.
ఇప్పటికే పూర్తయిన పనులు, పురోగతిలో ఉన్న పనులు వ్యయం (రూ.కోట్లలో)
రంగం పూర్తి | వ్యయం | పురోగతి | వ్యయం | మొత్తం | వ్యయం |
మరుగుదొడ్లు | 4,386 | 198.35 | 9,860 | 513.82 | 712.17 |
విద్యుత్ | 14,148 | 189.89 | 834 | 12.52 | 202.41 |
తాగునీరు | 1,988 | 31.07 | 12,410 | 163.80 | 194.87 |
ఫర్నిచర్ | 162 | 5.87 | 6,162 | 126.33 | 132.20 |
రంగులు | 64 | 0.92 | 836 | 12.32 | 13.24 |
మరమ్మతులు | 4,363 | 229.20 | 10,560 | 668.00 | 897.20 |
గ్రీన్ బోర్డులు | 3,582 | 20.57 | 3,830 | 20.81 | 41.38 |
ప్రహరీ | 289 | 6.62 | 262 | 8.59 | 15.21 |
నాబార్డు | 41 | 1.82 | 379 | 22.73 | 24.55 |
బహుళ పనులు | - | - | - | 36.26 | 36.26 |
పేరెంట్స్ కమిటీ | 10.61 | 10.61 | - | - | - |
తొలి దశలో నాడు-నేడు పనులు, అంచనా వ్యయం (రూ.కోట్లలో)
రంగం | పనులసంఖ్య | అంచనా వ్యయం |
నిరంతర నీటి సరఫరాతో మరుగుదొడ్లు | 14,293 | 826.70 |
విద్యుత్, ఫ్యాన్లు,ట్యూబ్ లైట్లు | 15,023 | 252.14 |
రక్షిత తాగునీరు | 14,474 | 325.19 |
ఫర్నిచర్, విద్యార్థులు, సిబ్బంది | 15,064 | 722.10 |
రంగులు | 13,561 | 359.07 |
పెద్ద, చిన్న మరమ్మతులు | 14,964 | 810.60 |
గ్రీన్ బోర్డు | 15,048 | 107.19 |
అదనపు తరగతి గదులు | 58 | 29.68 |
ప్రహరీ గోడ (పట్టణ) | 561 | 24.68 |
ఇంగ్లీష్ ల్యాబ్‌లు | 11,991 | 47.96 |
నాబార్డు | 428 | 443.62 |