మరో 2 సమాచార కమిషనర్ పోస్టులు మంజూరు
Sakshi Education
సాక్షి, అమరావతి: మరో రెండు సమాచార హక్కు కమిషనర్ పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ మరింత సమర్థంగా పనిచేసేందుకు వీలుగా.. ప్రస్తుతమున్న ఐదు పోస్టులకు అదనంగా ఈ 2 పోస్టులను మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. ప్రవీణ్ కుమార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. కొత్తగా మంజూరు చేసిన పోస్టులకు వచ్చిన దరఖాస్తులను వడపోసి అర్హుల జాబితాను రూపొందించేందుకు సీఎస్ అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు కె.ప్రవీణ్ కుమార్ మరో ఉత్తర్వు జారీ చేశారు. కమిటీలో సభ్యులుగా సీసీఎల్ఏతో పాటు న్యాయ కార్యదర్శిని నియమించారు. కన్వీనర్గా సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక సీఎస్ వ్యవహరిస్తారు. ఈ కమిటీ.. దరఖాస్తులను స్క్రూటినీ చేసి అర్హుల పేర్లను సీఎం నేతృత్వంలోని ఎంపిక కమిటీకి పంపించాల్సి ఉంటుంది.
Published date : 30 Apr 2021 02:53PM