మొదటి రోజు స్కూళ్లకు 9 శాతమే హాజరు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభమైన బుధవారం తొమ్మిది శాతం మంది విద్యార్థులే హాజరైనట్లు పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన తెలిపారు.
ఆదిలాబాద్‌లో సేవాలాల్ జయంతి నేపథ్యంలో బడులు ప్రారంభించలేదని, అక్కడ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రారంభం అయ్యాయని వెల్లడించారు. ప్రైవేటు స్కూళ్లు 80 శాతం వరకు ప్రారంభం అయినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18,030 పాఠశాలల్లో 1,31,1772 మంది విద్యార్థులకు గాను 1,17,304 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు.
Published date : 25 Feb 2021 05:14PM