మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) ఇక రెండేళ్లే...
Sakshi Education
సాక్షి, అమరావతి: మాస్టర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ) కోర్సు కాల పరిమితిని రెండేళ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
గతంలో ఈ కోర్సు కాల పరిమితి మూడేళ్లుగా ఉండేది. అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాజాగా ఈ కోర్సును రెండేళ్లకు కుదిస్తూ మార్గదర్శకాలిచ్చింది. దీనిలో చేరేందుకు మేథమెటిక్స్ సబ్జెక్టుతో బీఎస్సీ, బీఏ, బీకాం పూర్తిచేసిన అభ్యర్థులు వర్సిటీలు రూపొందించిన ‘ప్రీరిక్విజైట్’ కోర్సు పాసవ్వాలి. ఏఐసీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ‘ప్రీరిక్విజైట్’ కోర్సును రూపొందించుకోవాలని ఆయా యూనివర్సిటీల వీసీలకు రాష్ట్ర ప్రభుత్వం సూచించింది.
Published date : 22 Dec 2020 06:23PM