Skip to main content

లాక్‌డౌన్ తర్వాత కూడా ‘వర్క్ ఫ్రమ్ హోం’!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసే పరిస్థితి ఇకపై సాధారణం కానుంది.
లాక్‌డౌన్ ముగిసిన తరువాత కూడా ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసేందుకు ఉద్దేశించిన ముసాయిదా మార్గదర్శకాలను కేంద్ర సిబ్బంది శాఖ మే 14న విడుదల చేసింది. అర్హులైన అధికారులు/ఉద్యోగులు నిబంధనలను అనుసరిస్తూ ఏడాదిలో 15 రోజుల పాటు వర్క్ ఫ్రం హోం చేయవచ్చని తెలిపింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య దాదాపు 48.34 లక్షలు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం అమలుకు 75% ప్రభుత్వ శాఖల్లో ఈ-ఆఫీస్, వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసిస్తూ అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలకు కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం(డీఓపీటీ) లేఖ రాసింది. భవిష్యత్తులో విధుల్లోకి క్రమం తప్పకుండా హాజరు కావాల్సిన అవసరం లేకుండా, వేర్వేరు పనిగంటల తరహాలో విధులను నిర్వహించాల్సి ఉంటుందని, అందువల్ల, వర్క్ ఫ్రం హోంకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించామని పేర్కొంది. మార్గదర్శకాలకు సంబంధించి తమ స్పందనలను అన్ని శాఖలు 21లోగా పంపించాలని కోరింది.
Published date : 15 May 2020 03:30PM

Photo Stories