కేజీబీవీల్లో ప్రవేశాలకు జాబితా విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో నడుస్తున్న 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల్లో 2020-21 విద్యాసంవత్సరానికిగానూ 6వ తరగతిలో ప్రవేశం కోసం, 7, 8 తరగతులలో మిగిలిన సీట్ల భర్తీ కోసం మూడో విడత జాబితాను విడుదల చేసినట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఎంపికై న విద్యార్థినులు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 5వ తేదీలోపు వారి ఫోన్లకు పంపిన సమాచారం ప్రకారం తగిన ధ్రువీకరణ పత్రాలతో సంబంధిత కేజీబీవీల స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్టు చేయాలని వివరించారు. ఏవైనా సమస్యలు, సందేహాలు ఉంటే 9441270099, 9494383617 నంబర్లను సంప్రదించాలన్నారు.
Published date : 29 Sep 2020 12:58PM