కేజీబీవీల్లో ఇంటర్ ప్రవేశాలకు మూడో విడత జాబితా విడుదల
Sakshi Education
సాక్షి, అమరావతి: కస్తుర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) 2020 -21 ఇంటర్మీడియట్ ప్రవేశాల కోసం మూడో విడత విద్యార్థినుల జాబితాను సంబంధిత కేజీబీవీలకు పంపినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ కె.వెట్రిసెల్వి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎంపికై న విద్యార్థినులు ఈనెల 8వ తేదీలోగా సంబంధిత కేజీబీవీలలో స్పెషల్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేయాలని సూచించారు. విద్యార్థినుల జాబితాను వెబ్‌సైట్‌లోను, పాఠశాల నోటీసు బోర్డులోను ఉంచినట్లు తెలిపారు. ఇతర వివరాలకు 9441270099, 9494383617 నంబర్లలో సంప్రదించాలన్నారు.
Published date : 03 Oct 2020 02:55PM