కాలేజీ యాజమాన్యాలకు వైఎస్ జగన్ సూచనలు ఇవే..
Sakshi Education
సాక్షి, అమరావతి : పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో తాము ఉన్నత చదువులు పూర్తి చేస్తామనే నమ్మకం పెరిగిందని పలువురు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 28న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి జగనన్న విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం సూచనలు..
- కాలేజీ యాజమాన్యాలకు నా విజ్ఞప్తి. కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, మంచి ప్రమాణాలు ఉండేలా చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. వచ్చే విద్యా సంవత్సరం త్రైమాసికం నుంచి తల్లులు నేరుగా వచ్చి చూసి.. ఫీజు చెల్లిస్తారు. కాబట్టి, వారికి సంతృప్తి కలిగేలా మౌలిక సదుపాయాలు మెరుగు పరుచుకోండి.
- ఇంత మంది విద్యార్థుల మనసుల్లో స్థానం సంపాదించుకునే అవకాశం ఇచ్చినందుకు నిజంగా దేవుడికి కృతజ్ఞతలు. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రారంభిస్తున్నందుకు నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఆర్థిక పరిస్థితులు బాగో లేకపోయినా.. నాకున్న సమస్యల కంటే మీ సమస్యలు పెద్దవి అని భావించి, తల్లిదండ్రులకు ఊరటగా ఇది చేస్తున్నా.
Published date : 29 Apr 2020 04:11PM