జిల్లాకే ఆదర్శం వెంపటి పాఠశాల..!
Sakshi Education
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని వెంపటి ప్రాథమిక పాఠశాలలో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం మొదలైంది.
ఇందుకు కారణం విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంపై మక్కువ చూపడమే. దీంతో పాఠశాల ఉపాధ్యాయులు ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా గ్రామంలోని ఉద్యోగులు, యువజన సంఘాలతో ఇంటింటికి తిరిగి బడి ఈడు పిల్లల సర్వే నిర్వహించారు. నర్సరీ నుంచి 5వ తరగతి వరకు చదివే విద్యార్థులు 271 మంది ఉన్నారని గుర్తించారు. బడిలో విద్యా ర్థుల సంఖ్య పెంచేందుకు పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ఏర్పాటు చేసి మొదట గ్రామంలోని ఉద్యోగుల పిల్లలను బడిలో చేర్పించారు. ఆ తరువాత ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని కోరగా గ్రామ స్తులు స్పందించి విద్యార్థులను పాఠశాలకు పంపారు. మొదట పాఠశాలలో 87 మంది విద్యార్థులు ఉండగా, ఇంగ్లిష్ మీడియం ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 223 చేరుకొని జిల్లాలోనే ఆదర్శంగా నిలిచింది. గ్రామంలోని మూడు అంగన్‌వాడీ కేంద్రాలను, ప్రాథమిక పాఠశాల ఆవరణలోకి మార్చి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వరకు బోధిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో గ్రామస్తుల సహకారంతో ఇద్దరు వలంటీర్లను సైతం ఏర్పా టు చేశారు. గ్రామానికి చెందిన పలువురు ఉద్యోగుల సహకారంతో పాఠశాలకు వాచ్ మెన్‌ను ఏర్పాటు చేసి, ఇద్దరు వలంటీర్లకు కలిపి నెలకు రూ.15 వేలు ఖర్చు చేస్తున్నారు.
ఆహ్లాదకరంగా పాఠశాల ఆవరణ
పాఠశాలలోని విద్యార్థులకు విద్యతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు జనచైతన్య యూత్‌క్లబ్ ముందుకు వచ్చింది. ఉద్యోగులు, గ్రామస్తుల సహకారంతో రూ.7 లక్షలతో పాఠశాలకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు. కౌన్సిల్ ఆఫ్ ఫర్‌గ్రీన్ రెవల్యూషన్ (హైదరాబాద్) సహకారంతో పాఠశాల ఆవరణలో 400 రకాల మొక్కలను నాటి అబ్దుల్‌కలాం స్మృతివనం పేరిట పెంచుతున్నారు. గ్రామపంచాయితీ సహకారంతో రూ.52 వేలతో మొక్కలకు పైపులైన్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు తాగునీరు అందించడానికి మూలరాంరెడ్డి జ్ఞాపకార్థం ఆయన సతీమణి రూ.91వేలతో 2వేల లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్ నిర్మించారు. గ్రామ యువకులు జనచైతన్య కళావేదిక నిర్మించారు. విద్యార్థుల్లో భక్తిభావం పెంచేందుకు పాఠశాల ఆవరణలో సరస్వతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఉత్తమ పాఠశాలగా నిలుపుతాం..
గ్రామస్తుల సహకారంతో పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ఏర్పాటుచేశాం. పాఠశాల అభి వృద్ధికి పూర్తిస్థాయిలో కృషి చేస్తా. డిజిటల్ తరగతులు, క్రీడా, సాంస్కతిక కార్యక్రమాలు, పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి పాఠశాలను జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పాఠశాలగా నిలుపుతాం.
- వెంకట్రామనర్సయ్య, ప్రధానోపాధ్యాయుడు

Published date : 07 Mar 2020 03:47PM