`జగనన్న విద్యాకానుక` సక్రమంగా అందాలి: కె.వెట్రిసెల్వి
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్న విద్యాకానుక’ పథకం కింద ఇచ్చే అన్ని వస్తువులు సక్రమంగా అందాలని సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ‘జగనన్న విద్యా కానుక వారోత్సవాలు’ జరుగుతున్నాయని తెలిపారు. విజయవాడ పటమటలోని కేబీసీ బాలుర ఉన్నత పాఠశాల, కృష్ణలంక ఎంఆర్‌సీని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో వెట్రిసెల్వి మాట్లాడారు. ‘బ్యాగు, యూనిఫాం, బూట్లు, సాక్సులు, బెల్టు, మాస్కులు, నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు అందాయా లేదా’ అని అడిగి తెలుసుకున్నారు. ‘జగనన్న విద్యాకానుక’ కిట్లను ప్రతి విద్యార్థి సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. కిట్‌లో ఇచ్చిన వస్తువుల్లో తేడాలుంటే మార్చుకోవాలని సూచించారు. యూనిఫాం కుట్టు కూలీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సొమ్ము జమ అయి్యందా లేదా అని వెట్రిసెల్వి తెలుసుకున్నారు.
Published date : 24 Nov 2020 01:58PM