జగనన్న విద్యా కానుక’ అక్టోబర్ 5కు వాయిదా
Sakshi Education
సాక్షి, అమరావతి: ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యా సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు శుక్రవారం తెలిపారు.
‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5న ప్రభుత్వం నిర్వహించాలనుకున్న విషయం విదితమే. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్‌లాక్ 4.0 మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు తెరవకూడదని ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ 5కి వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు.
Published date : 05 Sep 2020 12:56PM