ఇస్రో‘యంగ్ సైంటిస్ట్, యువ విజ్ఞాన్’కు విద్యార్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం
Sakshi Education
సూళ్లూరుపేట: విద్యార్థి దశ నుంచే శాస్త్ర, సాంకేతికపరమైన విజ్ఞానాన్ని అందించి భవిష్యత్ శాస్త్రవేత్తలుగా తయారుచేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) యంగ్ సైంటిస్ట్ ,యువ విజ్ఞాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
విద్యార్థులకు స్పేస్ టెక్నాలజీ, స్పేస్ సైన్స్, స్పేస్ అప్లికేషన్స్ తదితర అంశాలను అందించడానికి గాను గతేడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విద్యాసంత్సరంలో (2019-20) 8, 9 తరగతి చదువుతున్న విద్యార్థుల దరఖాస్తులను ఇస్రో వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఇస్రో బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఒక్కో రాష్ట్రం నుంచి ముగ్గురు విద్యార్థుల చొప్పున ఎంపిక చేసి వారికి సంస్థ చేస్తున్న కార్యక్రమాలను వివరించనుంది. అలాగే ఇస్రో సెంటర్లను కూడా చూపించనుంది. దీనికిగాను విద్యార్థులు ఫిబ్రవరి 3 నుంచి 24లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్థుల విద్యాప్రమాణాలను ఆధారంగా తీసుకుని ఎంపికలు జరుగుతాయి. ఎంపికై న విద్యార్థులకు, వారితో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఇస్రో ఉచిత ప్రయాణ ఖర్చులు వసతి, భోజనం ఏర్పాటు చేయనుంది.
Published date : 23 Jan 2020 02:30PM