ఈసీహెచ్ఎస్ 51 పాలీక్లినిక్ల్లో ఒప్పంద నియామకాలు: రాజ్‌నాథ్ సింగ్
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశవ్యాప్తంగా గుర్తించిన ఎక్స్ సర్వీస్మెన్ హెల్త్ స్కీమ్(ఈసీహెచ్ఎస్) పాలీక్లినిక్ల్లో తాత్కాలిక ఒప్పంద ఉద్యోగులను తీసుకోవడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అనుమతిచ్చారు.
ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులపై సంతకం చేశారు. ఏపీలోని విశాఖ, గుంటూరు, తెలంగాణలోని సికింద్రాబాద్ సహా 51 క్లినిక్ల్లో ఒప్పంద ఉద్యోగులను తీసుకోనున్నారు. అవసరమైన చోట్ల మెడికల్ ఆఫీసర్, నర్సింగ్ అసిస్టెంట్, ఫార్మాసిస్ట్, డ్రైవర్ , చౌకీదార్ను తీసుకుంటారు. ఈ క్లినిక్ల్లో రాత్రి వేళల్లోనూ తక్షణ వైద్య సదుపాయం లభిస్తుందని, అనుమతి ఉత్తర్వులు ఆగస్టు 15 వరకు అమలులో ఉంటాయని రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Published date : 28 Apr 2021 03:06PM