‘ఇంటి వద్దకే బడి’ ఉత్తర్వుల్లో మార్పులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు (జీపీఎస్), ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసే బోధన సిబ్బంది విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి పాఠ్యాంశ బోధన చేపట్టాలని జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఎట్టకేలకు మార్పులు చేసింది.
ప్రతిరోజు పూర్తిస్థాయి సిబ్బంది కావాల్సిన అవసరం లేదని, 50శాతం ఉద్యోగులు రొటేషన్ పద్ధతిలో పనిచేస్తే చాలని సూచించింది. అలాగే విద్యార్థుల ఇళ్ల వద్దకు కాకుండా వారితో ఫోన్ ద్వారా ఆన్‌లైన్ పాఠ్యాంశ బోధన, అభ్యసన కార్యక్రమాలను పర్యవేక్షించాలని స్పష్టంచేసింది. ఈమేరకు సవరించిన ఉత్తర్వులను శనివారం ఆ శాఖ అదనపు సంచాలకుడు నవీన్ నికోలస్ జారీచేశారు.
Published date : 28 Sep 2020 03:03PM