ఇంటి వద్దకే బడి: గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ, ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త విధానం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు బడికి వెళ్లి చదువుకోవడం, లాక్‌డౌన్ కారణంగా ఆన్ లైన్ పాఠాలు, టీవీల్లో వీడియో తరగతులు వినడం చూశాం.
కానీ, గిరిజన సంక్షేమ శాఖ బోధన ప్రక్రియలో సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆ శాఖ పరిధిలోని ఆశ్రమ, ప్రభుత్వప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం బడినే ఇంటివద్దకు తీసుకెళ్తోంది. ఆన్‌లైన్ , వీడియో పాఠాలతో పాటు సంబం ధిత బోధకుడు నేరుగా విద్యార్థి ఇంటికి వెళ్లి 2గంటల పాటు పాఠ్యాంశాన్ని బోధిస్తారు. ఈ మేరకు చర్యలు చేపట్టాల్సిందిగా గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఇంటింటికీ చదువు...
గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో దాదాపు 320 ఆశ్రమ పాఠశాలలు, 1,510 ప్రభుత్వ పాథమిక పాఠశాలలు (జీపీఎస్) ఉన్నాయి. ఆశ్రమ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడితో పాటు టీచర్లు, సీఆర్‌టీ(కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్)లు ఉంటారు. తాజాగా హెచ్‌ఎంలు, టీచర్లు, సీఆర్‌టీలు ఏయే రకమైన విధులు నిర్వహించాలనే దానిపై గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతి ఉపాధ్యాయుడు, సీఆర్‌టీ ఆయా తరగతిలోని పిల్లల్ని అడాప్ట్ చేసుకుని బోధన, అభ్యసన కార్యక్రమాలు కొనసా గించాలి. గిరిజన ఆవాసాల్లో ఉండే జీపీఎస్‌లలో ఒక్కో టీచర్ ఉండగా... 10 మందిలోపు పిల్లలున్నారు. ఈ స్కూళ్లలో పనిచేసే టీచర్లు పూర్తిగా అదే ఆవాసానికి చెందిన వారే కావడంతో స్థానికంగా విద్యార్థి ఇంటికి వెళ్లి బోధ న, అభ్యసన కార్యక్రమాలు నిర్వహించడం ఇబ్బందికరమేమీ కాదు. విద్యార్థికి బోధన కార్యక్రమాలను మరింత చేరువ చేసేందుకే ఆ శాఖ ఈ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.

Published date : 19 Sep 2020 02:30PM