ఇంగ్లిష్ నేర్చుకునేందుకు ఇఫ్లూ యాప్
Sakshi Education
ఢిల్లీలో ప్రారంభించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
ఉస్మానియా యూనివర్సిటీ: ఇంగ్లిష్ భాషను సులభతరంగా నేర్చుకునేందుకు ఇంగ్లిష్ అండ్ ఫారేన్ లాంగ్వేజస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) ఉచితంగా మొబైల్ యాప్‌ను రూపొందించింది. ‘ఇంగ్లిష్ ప్రొ’పేరుతో రూపొందించిన ఈ యాప్‌ను ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ సోమవారం ప్రారంభించినట్లు ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ సురేష్‌కుమార్ తెలిపారు.
Learning English Made Easy: Check here
యూనివర్సిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ (యూఎస్‌ఆర్)లో భాగంగా ఈ యూప్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. విద్యార్థులు, ఆసక్తి గల అన్ని వర్గాల ప్రజలు ఇంగ్లిష్‌ను సులభంగా నేర్చుకునేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు. దేశంలోనే ఇలాంటి యాప్ రూపొందించిన ఘనత ఇఫ్లూకు దక్కిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి సంజయ్ శాంతారావు ధోత్రే తదితరులు పాల్గొన్నారు.

Published date : 01 Sep 2020 03:55PM