హెచ్‌ఎంలు బదిలీ అయినా.. నాడు-నేడు పనులు ఆపొద్దు: పాఠశాల విద్యా కమిషన్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఉపాధ్యాయుల బదిలీల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న ‘నాడు-నేడు’ పనులకు ఆటంకం కలగరాదని అధికారులకు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది.
ఆయా పాఠశాలల్లో ఈ పనులు పర్యవేక్షిస్తున్న ప్రధానోపాధ్యాయులు బదిలీ అయినప్పటికీ పనులు మాత్రం యథాతథంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టంచేసింది.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశాలిచ్చారు.
ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశాలిచ్చారు.
- పభుత్వ స్కూళ్ల హెచ్‌ఎంలు బదిలీ అయితే వెంటనే రిలీవ్ అయి కొత్త స్కూలులో చేరాలి.
- బదిలీపై వెళ్లే హెచ్‌ఎంలు నాడు-నేడు పనులు ఆపాలని పనివారిని ఆదేశించడానికి వీల్లేదు. ఆ పనులు కొనసాగేలా చూడాలి.
- ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న వారిని కొత్త హెచ్‌ఎంకు చూపి ఎంతమేర పనులు జరిగాయి.. చెల్లింపులు ఎంతమేర చేశారు? ఇంకా ఏ మేరకు చెల్లింపులు ఉన్నాయి తదితర అంశాలను కూడా వివరించాలి.
- బదిలీ అయిన హెచ్‌ఎం నాడు-నేడు పనులకు సంబంధించిన చెక్‌బుక్, ఇతర పత్రాలు, పుస్తకాలతో పాటు నిర్మాణ సామగ్రి, ఇతర అన్ని రకాల మెటీరియల్స్‌ని కొత్త హెచ్‌ఎంకు అందించకుండా రిలీవ్ అయితే ఆయన కొత్త పాఠశాలలో చేరిన తరువాత ఏడు రోజుల్లో వాటిని నూతన హెచ్‌ఎంకు అప్పగించాలి. అలా అప్పగించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
- బాధ్యతలు అప్పగించే సమయంలో తల్లిదండ్రుల కమిటీ ఛైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్లలో ఒకరిని సాక్షిగా ఉంచి సంతకాలు తీసుకోవాలి.
Published date : 16 Jan 2021 03:10PM