Skip to main content

ఎస్వీయూలో ఏపీఆర్‌సెట్ కౌన్సెలింగ్ ప్రారంభం

యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): ఏపీఆర్‌సెట్-2019లో అర్హత సాధించిన వారికి ఎస్వీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి కౌన్సెలింగ్ ప్రక్రియను గురువారం ప్రారంభించారు. తొలిరోజు ఆర్‌‌ట్స కోర్సులకు (ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, లైబ్రరీ సైన్స్, ఇంగ్లిష్, లింగ్విస్టిక్స్, పాపులేషన్ స్టడీస్, సోషియాలజీ, సంస్కృతం, ఫిలాసఫీ) కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ కోర్సులకు 62 సీట్లు అందుబాటులో ఉండగా 1:2 నిష్పత్తిలో 124 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. తొలిరోజు 29 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంగ్లిష్ విభాగంలో రెండో ర్యాంకు పొందిన ఆడూరి సంధ్యకు తొలి అడ్మిషన్ ఇచ్చారు. కాగా, శుక్రవారం కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్ విభాగాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కార్యక్రమంలో రెక్టార్ జీఎం సుందరవల్లి, డెరైక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డెరైక్టర్ ఎం.వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు.
Published date : 21 Aug 2020 01:53PM

Photo Stories