ఎస్సీ విద్యార్థులకు రూ.59 వేల కోట్ల స్కాలర్‌షిప్
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ కుల(ఎస్‌సీ) విద్యార్థుల విద్యాభ్యాసం కోసం కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్లలో 4 కోట్లకు పైగా విద్యార్థుల కోసం రూ. 59,000 కోట్ల పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం 60 శాతం వాటా (35,534 కోట్లు) భరించనుండగా, మిగిలిన 40 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని కేంద్ర మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ చెప్పారు. బుధవారం ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. ఢిల్లీలోని అనధికార కాలనీల్లో నివసిస్తున్న వారికి చట్టపరమైన రక్షణను మరో మూడేళ్ళపాటు కొనసాగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఢిల్లీ లా ఆఫ్ ఎన్‌సీటీ ఆర్డినెన్స్‌ను ఈ రోజు కేబినెట్ ఆమోదించిందన్నారు.
Published date : 24 Dec 2020 04:28PM