ఏప్రిల్ 8 నుంచి సీఐసీఎస్‌ఈ పరీక్షలు.. ఏపరీక్ష ఎప్పుడంటే..
Sakshi Education
న్యూఢిల్లీ: 2021 సంవత్సరానికి గాను బోర్డు పరీక్షల తేదీలను కౌన్సిల్ ఫర్ ద ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్స్ (సీఐసీఎస్‌ఈ)సోమవారం ప్రకటించింది.
12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి, 10వ తరగతి పరీక్షలు మే 5 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. అలాగే ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (ఐసీఎస్‌ఈ) 10వ తరగతి పరీక్షలు మే 5 నుంచి జూన్ 7వ తేదీ వరకు జరుగనున్నాయి. ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ (ఐఎస్‌సీ) 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి జూన్ 16వ తేదీ వరకు జరుగుతాయని సీఐసీఎస్‌ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. జూలై కల్లా ఫలితాలను వెల్లడిస్తారని చెప్పారు.
Published date : 02 Mar 2021 02:43PM