Skip to main content

ఏపీలో నవంబర్ 2 నుంచి పాఠశాలలు ప్రారంభం ..!

సాక్షి, అమరావతి: వచ్చే నెల 2వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్ని తెరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
కోవిడ్-19 నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా స్కూళ్లు తెరవడంపై సీఎం పలు సూచనలు చేశారు. రెండు రోజులకు ఒకసారి మాత్రమే తరగతులను నిర్వహించనున్నట్టు తెలిపారు.

తరగతులు నిర్వహించేది ఇలా..
  • 1, 3, 5, 7 తరగతుల వారికి ఒక రోజు.. 2, 4, 6, 8 తరగతుల విద్యార్థులకు మరో రోజు క్లాసులు నిర్వహిస్తారు.
  • ఒకవేళ ఏదైనా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహిస్తారు.
  • అన్ని స్కూళ్లలో కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే తరగతులు జరుగుతాయి. భోజనం పెట్టిన అనంతరం విద్యార్థులను ఇంటికి పంపిస్తారు
  • నవంబర్ నెలలో ఇదే విధానం అమలవుతుంది. పరిస్థితిని బట్టి డిసెంబర్‌లో తదుపరి నిర్ణయం తీసుకుంటారు.
  • ఒకవేళ తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపకపోతే.. అలాంటి విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలి.
Published date : 21 Oct 2020 01:48PM

Photo Stories