ఏపీ గురుకులాల్లో రెండు వారాలు చికెన్ వద్దు!
Sakshi Education
సాక్షి, అమరావతి: సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఈనెల 16 నుంచి 29వ వరకు విద్యార్థులకు చికెన్ కర్రీ వడ్డించవద్దని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఇన్‌చార్జి కార్యదర్శి కె.హర్షవర్థన్ ఫిబ్రవరి 15 (శనివారం)న లిచ్చారు.
చికెన్‌కు బదులు ఒక ప్రత్యేక వెజిటబుల్ కర్రీ, స్వీట్‌ను వడ్డించాలని గురుకులాల విద్యాలయాల ప్రిన్‌సపాల్స్‌కు సూచించారు. జిల్లా కో-ఆర్డినేటర్లు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు హర్షవర్థన్ పేర్కొన్నారు.
Published date : 17 Feb 2020 03:31PM