Skip to main content

ఏపీ డీఎడ్‌ సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలు వాయిదా

సాక్షి, అమరావతి: డీఎడ్‌ (2019–21 బ్యాచ్‌) సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పరీక్షలు జూన్‌ 21 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కర్ఫ్యూను ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించిన నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వివరించారు. తదుపరి జూలై 5 నుంచి 8వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.

చదవండి: ఏపీపీఎస్సీ గ్రూప్‌–1 ఇంటర్వ్యూ బోర్డును అభ్యర్థులే ఇలా ఎంచుకోవచ్చు.. 

చదవండి: జూన్‌ 16 నుంచి పాఠశాల విద్యార్ధులకు డిజిటల్‌ తరగతులు?
Published date : 15 Jun 2021 02:43PM

Photo Stories