ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్‌షిప్‌కు తెలంగాణ నుంచి 225 మంది ఎంపిక
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్‌ఈ) స్కాలర్‌షిప్‌నకు రాష్ట్రం నుంచి 225 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.
వారి జాబితాను తమ వెబ్‌సైట్ (http://bse.telangana.gov.in )లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి వెల్లడించారు. ఫిబ్రవరి 21న నిర్వహించిన పరీక్షల ఫలితాలను జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్‌సీఈఆర్‌టీ) ఇటీవల వెల్లడించిందని ఆయన పేర్కొన్నారు. స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇంటర్మీడియెట్‌లో రెండేళ్లపాటు నెలకు రూ. 1250 చొప్పున స్కాలర్‌షిప్ ఇస్తుందని తెలిపారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో నెలకు రూ. 2 వేల చొప్పున చెల్లిస్తుందని, పీహెచ్‌డీ సమయంలో యూజీసీ నిర్ణయించిన స్కాలర్‌షిప్‌ను అందిస్తుందని వివరించారు.
Published date : 16 Jun 2021 06:05PM