ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలపై హైకోర్టు కీలక తీర్పు.. ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు!
Sakshi Education
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఎవరు స్థానిక అభ్యర్థులనే విషయంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.
తాము వరుసగా పదేళ్లపాటు ఒకే ప్రాంతంలో విద్యను అభ్యసించామని, అందువల్ల తమను స్థానిక అభ్యర్థులుగా పరిగణించేలా ఎన్‌టీఆర్ వైద్య వర్సిటీ అధికారులను ఆదేశించాలని కోరుతూ పలువురు విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. స్థానిక అభ్యర్థుల విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు చాలా స్పష్టంగా ఉన్నాయని, అందువల్ల వాటికి విరుద్ధంగా తామెలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు.. జస్టిస్ ప్రవీణ్‌కుమార్, జస్టిస్ దొనడి రమేశ్‌లతో కూడిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది. ప్రవేశాలు కోరే అభ్యర్థి.. తాను ఏ స్థానిక ప్రాంతానికి చెందిన అభ్యర్థినని చెబుతున్నారో, ఆ ప్రాంతంలో ఏదైనా విద్యా సంస్థలో వరుసగా నాలుగేళ్లకు తక్కువ కాకుండా చదివి ఉండాలని, ఆ నాలుగేళ్లను +2తో ముగించి ఉండాలని, అలాంటి అభ్యర్థే ఆ ప్రాంతానికి స్థానిక అభ్యర్థి అవుతారని రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టంగా చెబుతున్నాయని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. గుంటూరు లయోలా పబ్లిక్ స్కూల్‌లో 3 నుంచి 10వ తరగతి వరకు, 11, 12 తరగతులు మైసూర్‌లో చదివానని, తన చిరునామా గుంటూరుగానే ఉందని, ఆంధ్రా వర్సిటీ పరిధిలోకి వచ్చే తనను స్థానికేతర అభ్యర్థిగా పరిగణించారంటూ గుంటూరుకు చెందిన పసుపులేటి కోటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తదితర జిల్లాలకు చెందిన పలువురు కూడా ఇవే ఫిర్యాదులతో హైకోర్టును ఆశ్రయించారు. తమను స్థానిక అభ్యర్థులుగా పరిగణించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.
పిటిషనర్లు స్థానికులు కారు
అయితే దీన్ని ఎన్‌టీఆర్ వర్సిటీ అధికారులు వ్యతిరేకించారు. ఎవరు స్థానికులన్న దానిపై రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయని కోర్టుకు నివేదించారు. పిటిషనర్లు వాటిని సంతృప్తిపరచలేదని, అందువల్ల వారిని స్థానిక అభ్యర్థులుగా పరిగణించడం కుదరదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రస్తుత కేసులో పిటిషనర్లు రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 3.4.1 నిబంధనను సంతృప్తిపరచలేదని పేర్కొంది. ఇంటర్ లేదా 11, 12 తరగతులను పిటిషనర్లు ఇతర రాష్ట్రాల్లో చదివారని, అందువల్లే స్థానిక అభ్యర్థుల కిందకు రాలేదని గుర్తు చేసింది. నిబంధన ప్రకారం.. స్థానిక అభ్యర్థి కాని వ్యక్తిని స్థానిక అభ్యరిగా పరిగణించాలంటే, ఆ వ్యక్తి రాష్ట్రంలో ఏదైనా విద్యా సంస్థలో వరుసగా ఏడేళ్లకు తక్కువ కాకుండా చదివి, 12వ తరగతితో ఆ ఏడేళ్లను ముగించి ఉండాలని తెలిపింది. వీటిని పరిగణనలోకి తీసుకుని పిటిషనర్ల వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు స్పష్టం చేసింది.

Published date : 18 Dec 2020 02:06PM