ఏళ్ల తరబడి విధులకు హాజరుకానందుకు 14 మంది టీచర్ల తొలగింపు: విద్యా శాఖ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఏళ్ల తరబడి ఎలాంటి అనుమతి లేకుండా విధులకు హాజరుకాని 14 మంది టీచర్లపై విద్యా శాఖ చర్యలు తీసుకుంది.
వారిని సర్వీసు నుంచి తొలగించింది. సెలవులు పెట్టకుండా చాలా కాలంగా విధులకు గైర్హాజరు అవుతున్న 106 మంది టీచర్లను విద్యా శాఖ గుర్తించింది. 14 మందిని తొలగిస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా 92 మందిపై సీసీఏ నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు చేపట్టాలని విద్యా శాఖ నిర్ణయించింది.
జిల్లాల వారీగా తొలగించిన టీచర్లు..
జిల్లాల వారీగా తొలగించిన టీచర్లు..
- కామారెడ్డి: సి.విద్యుల్లత (స్కూల్ అసిస్టెంట్-జెడ్పీహెచ్‌ఎస్, సోమార్‌పూర్); సనా నాజ్, (ఎస్‌జీటీ-యూపీఎస్, కండెబల్లార్).
- నాగర్‌కర్నూల్: ఆర్.మదన్‌మోహన్‌రెడ్డి (ఎస్‌జీటీ-ఎంపీపీఎస్, కుర్దెవాడ తండా); సి.అంజనమ్మ (ఎస్‌జీటీ-ఎంపీయూపీఎస్, హన్‌మాన్‌నగర్), ఆస్మాసుల్తానా (ఎస్‌జీటీ-ఎంపీపీఎస్ తిమ్మాజీపేట్).
- హైదరాబాద్: తహనియత్ జహా (ఎస్‌జీటీ-జీపీఎస్ చార్మినార్-2), వీకే శెష్‌లత (ఎస్‌జీటీ-జీపీపీఎస్ గోషాకట్).
- ఖమ్మం: జి.సునీత (స్కూల్ అసిస్టెంట్-యూపీఎస్ రేపల్లెవాడ).
- కరీంనగర్: ఎన్.సౌజన్య (ఎస్‌జీటీ-ఎంపీపీఎస్ రుక్మాపూర్), ఎం.విజయలక్ష్మి (ఎస్‌జీటీ-ఎంపీయూపీఎస్ చమాన్‌పల్లి), పి.విజయ్‌కుమార్ (ఎస్‌జీటీ-ఎంపీపీఎస్ కాదంబపూర్).
- నిర్మల్: ప్రవీణ్‌కుమార్ (ఎస్‌జీటీ-ఎంపీపీఎస్ మైసంపేట్).
- జగిత్యాల: అనుగంటి సురేశ్ (స్కూల్ అసిస్టెంట్-జెడ్పీహెచ్‌ఎస్ అంబారిపేట్), ప్రభాసిని (స్కూల్ అసిస్టెంట్-జెడ్పీహెచ్‌ఎస్ షెఖెల్లా).
Published date : 07 Jan 2020 02:22PM