ఏఎన్‌యూకి క్యూఎస్ ఆసియా ర్యాంక్
Sakshi Education
ఏఎన్‌యూ (గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యూఎస్ ఆసియా ర్యాంక్‌ను సాధించింది.
యూకే (యునెటైడ్ కింగ్‌డమ్)కు చెందిన ర్యాంకుల అధ్యయన సంస్థ క్యూఎస్ (క్వాక్యురల్లీ సైమండ్‌స) 2021వ సంవత్సరానికి గాను ఆసియా విశ్వవిద్యాలయాల ర్యాంకులను ప్రకటించింది. ఈ ర్యాంకుల్లో ఏఎన్‌యూ 551-600 కేటగిరీలో ర్యాంకును సొంతం చేసుకుంది. క్యూఎస్ సంస్థ ఆసియా వ్యాప్తంగా 600 యూనివర్సిటీలను, దేశంలో 107 యూనివర్సిటీలను మాత్రమే ఈ ర్యాంకులకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా గురువారం యూనివర్సిటీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో వీసీ ఆచార్య పి.రాజశేఖర్ మాట్లాడుతూ.. యూనివర్సిటీ అధికారులు, సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థుల సమష్టి కృషితోనే ఏఎన్‌యూ క్యూఎస్ ర్యాంకును సాధించగలిగిందన్నారు.
Published date : 27 Nov 2020 01:47PM