దరఖాస్తులు కోరుతోన్న టీఎస్ బీసీ గురుకులాలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మహాత్మాజ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 6, 7, 8వ తరగతుల్లో (ఇంగ్లిషు మీడియం) ఖాళీగా ఉన్న సీట్లకు ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్యభట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు ఈ నెల 29లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు mjptbcwreis.telangana.gov.in, mjptbcwreis.cgg.gov.in వెబ్‌సైట్‌లను సందర్శించాలని పేర్కొన్నారు.
Published date : 18 Feb 2020 03:11PM