డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు ఇంటర్న్‌షిప్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు వీలుగా నైపుణ్యాలు అలవర్చడం, నేటి పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థుల్లో మెళకువలను అభివృద్ధి పర్చడం లక్ష్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ డిగ్రీ, డిప్లొమా విద్యార్థులకు కూడా ఇంటర్న్‌షిప్/ అప్రెంటీస్‌షిప్‌ను అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు శనివారం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు కేంద్రం ఇంటర్న్‌షిప్‌కు బడ్జెట్లో నిధులు కూడా కేటాయించిందని, ఇంటర్న్‌షిప్ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలని యూజీసీ ఉన్నత విద్యామండళ్లు, వర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలకు ఒక సర్క్యులర్ విడుదల చేసింది.
Published date : 14 Dec 2020 03:53PM