దేశవ్యాప్తంగా తెరుచుకోనున్న యూనివర్సిటీలు
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో పూర్తి భద్రత కోసం దేశవ్యాప్తంగా మూసివేసిన యూనివర్సిటీలు, కళాశాలలను తిరిగి తెరవాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజిసి) కోరింది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక అధికార యంత్రాంగం అనుమతి ఆధారంగానే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. గతంలో ఆఫ్‌లైన్ తరగతుల ప్రారంభంకోసం జారీ చేసిన కోవిడ్-19 మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని సూచిస్తూ యూనివర్సిటీలు, కళాశాలలకు తిరిగి తెరుచుకొనేందుకు పూర్తి స్వాతంత్య్రం ఇచ్చారు. దేశవ్యాప్తంగా మూసివేసిన వర్సిటీలు, ఇతర ఉన్నత విద్యా సంస్థలను ప్రారంభించాలన్న విద్యార్థుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని యుజిసి ఈ ప్రతిపాదన చేసింది. ప్రతిరోజూ మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కరోనాకు సంబంధించి వేలాది కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల్లో ఉన్నత విద్యాసంస్థలు తెరుచుకొనే విషయంలో యూజీసీ పూర్తి అప్రమత్తంగా ఉంది. అందులో భాగంగానే మళ్ళీ తెరిచేందుకు ఉన్నత విద్యాసంస్థలకే నిర్ణయాధికారం ఇచ్చారు.
Published date : 09 Feb 2021 04:06PM